మానవత్వాన్ని చాటుకున్న దుబాయ్ అద్నాన్ కార్ వాష్ కంపెనీ ఉద్యోగులు

మానవత్వాన్ని చాటుకున్న దుబాయ్ అద్నాన్ కార్ వాష్ కంపెనీ ఉద్యోగులు

– చిన్నారి అవంతిక కి  ఆర్థిక సహాయం

దుబాయ్, నవంబర్ 13 , (మన సాక్షి) : పలు కుటుంబాలకు తన వంతు సేవా చేస్తూ మానవత్వం చాటుకుంటున్న దుబాయ్ లో అద్నాన్ కార్ వాష్ కంపెనీ ఉద్యోగులు తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ అమ్మాయి మ్యాదరి అవంతిక కి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే… కథలపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మ్యాదరి నారాయణ ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు, అప్పటినుంచి భార్య రజిత కూలినాలి చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు అవంతిక తో జీవనం సాగిస్తుంది.

ఇంతలో కాలం రజిత ను చిన్న చూపు చూసింది. రజిత గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుంది. వైద్యం చేయించుకోవడానికి చేతిలో డబ్బులు లేక ఒక్కగానొక్క కూతురిని ఒంటరి చేసి వెల్లుపోయింది. రజిత మరణించడంతో ఒక్కగానొక్క కూతురు అవంతిక అనాథగా మారింది. ఈ విషయాన్ని నా కలం అక్షర సత్యం ఫేసుబుక్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దుబాయ్ అద్నాన్ కార్ వాష్ కంపెనీ మిత్రులు కలిసి తమ వంతుగా చిన్నారి అవంతిక భవిష్యత్ కోసం  7500/- రూ, పంప్పించడం జరిగింది.

ఈ సందర్భంగా టీం సభ్యుడు మాట్లాడుతూ అవంతిక కి ఆర్థిక సహాయం అందించిన దుబాయ్ అద్నాన్ కార్ వాష్ కంపెనీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.