అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య..!

అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య..!

హత్నూర,మన సాక్షి:

హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో నవాబ్ పేట గ్రామంలో అప్పుల బాధతో రైతు గడ్డి మందు తాగి మృతిపట్ల స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఫిర్యాదుదారు మేరకు మంగళి కావేరి భర్త రుక్మేష్ (30) .

 

తన భర్త అగు మంగలి రుక్మేష్ తండ్రి లేట్ యాదయ్య,నవాబ్‌పేట్ గ్రామంలో ఇతరుల నుండి అప్పులు తీసుకొని ఒక సంవత్సరం క్రితం ఒక వరి కోత యంత్రాన్ని తెచ్చి, వ్యవసాయంపై పెట్టుబడి పెట్టాడు కానీ, వ్యవసాయం , వరి కోత యంత్రం నుండి అతనికి తగినంత లాభం రాలేదు.

 

ALSO READ :

  1. అనుమానాస్పద స్థితిలో 6 సంవత్సరాల బాబు మృతి
  2. BREAKING : ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇకలేరు..!
  3. రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు వరకు మెట్రో రైలు సదుపాయం
  4. అప్పుడే పుట్టి చనిపోయిన ఆడ శిశువు మృతదేహం లభ్యం

 

దాని కారణంగా అతను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం లేక. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు ”పారానెక్స్” అనే కలుపు సంహారక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 

చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సుభాష్ వివరించారు.