పెద్దగట్టు జాతరలో డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా, పార్కింగ్ రూట్ మ్యాప్ విడుదల

పెద్దగట్టు జాతరలో డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా
ఏర్పాట్లు సమీక్ష నిర్వహించిన జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్
వాహనాల మళ్లింపు, వాహనాల పార్కింగ్ స్థలాలు చూపే రూట్ మ్యాప్ విడుదల.
1850 మంది పొలిసు సిబ్బంది, 500 మంది వాలింటీర్స్ తో మూడు విడతల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు
60 CCTV కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా
భక్తులు, వాహనదారులు పోలీసు వారి సూచనలు పాటించాలి.
జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు కు ప్రత్యెక ప్రణాళిక.
సూర్యాపేట, మనసాక్షి :
ఫిబ్రవరి 5వ తేదీ నుండి జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర యొక్క పోలీసు బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి గురువారం జిల్లా పోలీసు కార్యాలయం లో పోలీసు అధికారులతో జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. , జాతర సందర్భంగా జాతీయరహదారిపై వాహనాల మళ్లింపు, జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలకు సంభందించి రూట్ మ్యాపు లను విడుదలచేశారు.. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలింటీర్స్ తో పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు, రోజు మూడు విడతల్లో 24 గంటలు సిబ్బంది విదులు నిర్వర్తిస్తారు అన్నారు. జాతర పరిసరాల్లో పోలీసు కంట్రోల్ రూమ్, హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగినది. హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా అత్యవసర సమయాల్లో పోలీసు వారి సేవలను పొందవచ్చు అన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వాహనాల మళ్లింపు చర్యలు, బారికేడింగ్స్ ఏర్పాటు, పోలీసు కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ సెంటర్స్, క్యూ లైన్స్, సిసిటివి కెమెరాల ఏర్పాటును సమీక్షించారు. ప్రజలు , భక్తులు, వాహనదారులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని అన్నారు..
పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాహనాల మళ్లింపు ఇలా
దారిమళ్ళింపు (1) :- హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెల్లు వాహనాలను టేకుమట్ల మద్ద జాతీయరహదారి 65 నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 బిబి మీదుగా మళ్లించి, రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది.
హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్ళు బారి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలను టేకుమట్ల నుండి జాతీయ రహదారి 365 మీదుగా నాయకెన్ గూడెం నుండి కోదాడ వైపు మళ్లింపు చేయడం జరిగినది.
దారిమళ్ళింపు (2):- విజయవాడ నుండి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలను జాతీయ రహదారి 65 పై స్వామి నారాయణ్ గురుకుల్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ రోడ్డు మీదుగా ఖమ్మం జాతీయ రహదారి 365 బిబి గూడెం , రోల్లబండ తండా వరకు మళ్లించి జాతీయరహదారి రాయినిగూడెం వద్ద యూ టర్న్ చేసి హైదరాబాద్ వైపు పంపించడం జరుగుతుంది.
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే బారి వాహనాలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలను కోదాడ, నరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా నార్కట్ పల్లి వద్దకు మళ్ళించడం జరిగినది.
కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్ టి సి బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ నుండి బీబిగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణం నుండి వెళ్ళే ఆర్ టి సి బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది.
జాతరకు వచ్చు భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం 4 అంతకన్నా ఎకువ చక్రాలు గల వాహనాలకు 4 బారి పార్కింగ్ ప్రదేశాలను, ద్విచక్ర వాహనాలకు కోసం ప్రత్యెక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది
మొదటి పార్కింగ్ ప్రదేశం :
సూర్యాపేట మీదుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను జాతీయ రహదారి65 మీద గల హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి రామకోటి తండాకు వెల్లు మార్గంలో వాహనాల పార్కింగ్ కు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు.
రెండవ పార్కింగ్ ప్రదేశం :
గరిడేపల్లి, పెనపహడ్ వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను కలక్టర్ కార్యాలయం వెనుక గల స్థలంలో బారి పార్కింగ్ స్థలం ఏర్పాటు.
మూడవ పార్కింగ్ ప్రదేశం :
కోదాడ, మునగాల, గుంపుల వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఖాసింపేట గ్రామం వెల్లు మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.
నాలుగోవ పార్కింగ్ ప్రదేశం :
మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వేంల మీదుగా మళ్లించి మున్యానాయక్ తండా వద్ద(గట్టుకు వెనకాల) పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగింది
వి ఐ పి పార్కింగ్
జాతరకు వచ్చే వి ఐ పి ల యొక్క వాహనాల కోసం పెద్దగట్టు యొక్క తూర్పు మెట్లకు ఎదురు భాగంలో గల స్థలంలో పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగినదన్నారు.
ఈ సమావేశం నందు డి ఎస్ పి లు నాగబుషణం, వెంకటేశ్వర రెడ్డి, రవి, సి ఐ లు సోమ నారాయణ్ సింగ్, శ్రీనివాస్, నాగార్జున, పి ఎన్ డి ప్రసాద్, నరసింహ, గౌరినాయుడు, ఆర్ ఐ లు శ్రీనివాస రావు, శ్రీనివాస్, నరసింహారావు, ఎస్ ఐ లు విష్ణుమూర్తి, మధు, సాయిరాం, యాధవెంధర్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, రవీందర్, హరికృష్ణ, వీరన్న, జీ ఎం ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.