ఫ్లాష్ న్యూస్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి , మన సాక్షి :

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన సంఘటన గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో చోటు చేసుకుంది. ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..

కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా నుంచి స్కూటీపై ఇంటికి వెళుతుండగా నాగర్ కర్నూల్ నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి ఢీకొన్నారని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.