అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లుసీజ్, కేసు నమోదు

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లుసీజ్, కేసు నమోదు
మాడ్గులపల్లి , మనసాక్షి:
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామ శివారులో లోని పాలేరువాగు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 3ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్ఐ కైగురి నరేష్ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన మండలంలోని గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన గంగినపల్లి సైదిరెడ్డి, భూగిడి నరేష్ లతో పాటు బొమ్మకల్ గ్రామానికి చెందిన దామెర్ల రాకేష్ లపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.