మిర్యాలగూడ : సౌండ్ ఎక్కువ వచ్చే సైలెన్సర్స్ అమర్చిన ద్విచక్ర వాహనాలు సీజ్

మిర్యాలగూడ : సౌండ్ ఎక్కువ వచ్చే సైలెన్సర్స్ అమర్చిన ద్విచక్ర వాహనాలు సీజ్
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
మిర్యాలగూడ టౌన్ మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలో టాకా రోడ్డు ఓల్డ్ గ్రామీణ బ్యాంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ యొక్క డ్రైవర్స్ అతివేగంగా, అజాగ్రత్తగా పబ్లిక్ పేసుల్లో భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చి అతివేగంగా డ్రైవింగ్ వారి నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మోటార్ సైకిల్ కు ఉన్న కంపెనీ సైలెన్సర్స్ తీసేసి భారీ సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చి అతివేగంగా తిరుగుతున్న వాహనాలను పట్టుకొని కేసు నమోదు, నాలుగు వాహనాలను సీల్ చేసి కోర్టుకు పంపారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.