కంఠమహేశ్వర స్వామి ఆలయానికి విగ్రహాలను బహుకరించిన గట్టు

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి విగ్రహాలను బహుకరించిన గట్టు
తుర్కపల్లి, మనసాక్షి
తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించతలపెట్టిన కంట మహేశ్వర స్వామి ఆలయానికి తనవంతు సహాయంగా బి.ఆర్.ఎస్ యువ నాయకులు, గ్రామ వాస్తవ్యులు గట్టు తేజస్వి నిఖిల్ దేవాలయంలో నెలకొల్పడానికి విగ్రహాలను ఇప్పిస్తున్నట్లుగా గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మాదాపురం గ్రామ గౌడ కులస్తులు గట్టు తేజస్వి నిఖిల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఉప సర్పంచ్ సీతారాజు, పనగట్ల రాజనర్సయ్య, పనగట్ల సుదర్శన్, పనగట్ల సుభాష్, గడ్డమీది రాములు, గడ్డమీది మురళి, మారగాని వెంకటేష్, ప్రవీణ్, లింగంపల్లి రవి, లింగంపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.