గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు – దీపిక యుగంధర్ రావు

గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు – దీపిక యుగంధర్ రావు
బీఆర్‌ఎస్ హయాంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం
– అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్‌పర్సన్, గుజ్జ దీపిక యుగంధర్ రావు
తుంగతుర్తి , మన సాక్షి
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవఖానా లను అందు బాటులోకి తీసుకొచ్చిందని జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు అన్నారు. మండల పరిధిలోని వెంపటి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె దవాఖాన, రూ .10 లక్షల వ్యయంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనంతో పాటు గ్రామీణ క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… గతంలో వైద్యం చేయించుకోవాలంటే పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లోనే పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసి, మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ యువతకు అందుబాటులో ఆట స్థలాలను ఏర్పాటు చేయడంతో పాటు, పట్టణాలకు తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పకృతి వనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.
గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ఎంపీపీ గుంగాని కవితా రాములు గౌడ్, మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్,స్థానిక సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ గుండ గాని వీరస్వామి, ఎంపీడీవో భీమ్ సింగ్, డి ప్రభాకర్, ఏఈ ప్రభు కిరణ్, గ్రామ కార్యదర్శి శ్రీధర్,ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,
జిల్లా నాయకులు గుండగానీ రాములు గౌడ్, మాజీ సర్పంచులు తునికి సాయిలు, కొండగడుపుల నాగయ్య, మత్స్య సొసైటీ అధ్యక్షుడు ఇండ్ల సోమయ్య,నాయకులు ముత్యాల వెంకటేశ్వర్లు, గోపగాని రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చెరుకు పరమేష్, దీప్లా నాయక్, తునికి లక్ష్మమ్మ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఆకారపు సైదులు,బిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు రచ్చ నవీన్, మండల ప్రజాప్రతినిధులు, గ్రామ వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.