క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

మహిళ వద్ద నుంచి 12 తులాల బంగారం పట్టపగలు చోరీ..!

జోగిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి వెళ్లేందుకు బస్‌ ఎక్కుతున్న మహిళ బ్యాగులో ఉన్న చేతి పర్సును దొంగిలించిన సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి భాదితురాలి కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

మహిళ వద్ద నుంచి 12 తులాల బంగారం పట్టపగలు చోరీ..!

అందోలు, మనసాక్షిః

జోగిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి వెళ్లేందుకు బస్‌ ఎక్కుతున్న మహిళ బ్యాగులో ఉన్న చేతి పర్సును దొంగిలించిన సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి భాదితురాలి కథనం ప్రకారం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.

అల్లాదుర్గం గ్రామానికి చెందిన చేగూరి లక్ష్మిదేవి సంగారెడ్డిలో బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని ఆర్టీసీ బస్సులో బయలేదేరి జోగిపేటలో దిగింది. బస్టాండ్‌లో మరో బంధువుతో కలిసి మెదక్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సంగారెడ్డికి వెళ్లేందుకు ఎక్కి సీట్లో కూర్చోగా, బ్యాగులో ఉన్న చేతి పర్సు కనిపించకపోవడంతో ఆందోళనతో బస్సు దిగి లబోదిబో మంటూ అటు, ఇటు వెతికినా లాభం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భాదితురాలు ఫిర్యాదు చేసింది.

చేతి పర్సులో 12 తులాల బంగారం, రూ.8 వేలS నగదు ఉన్నట్లు భాదితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్టాండ్‌లోని సీసీ పుటేజీని పరిశీలించగా ఎరుపు చీర మహిళ ధరించిన మహిళ అనుమానస్పదంగా బస్సు ఎక్కి వెంటనే బస్సు దిగి వెళ్లిపోవడంతో ఆమె ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నారు.

ఈ సంఘటన విషయమై భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ అనీల్‌కుమార్‌ తెలిపారు. సీసీ పుటేజీ అధారంగా నిందితులను పట్టుకుంటామనని సీఐ తెలిపారు.

MOST READ 

మరిన్ని వార్తలు