Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్రాజకీయం

TG News : ఎకరానికి 20 లక్షల పరిహారం, ఉద్యోగం.. సీఎం సంచలన ప్రకటన..!

TG News : ఎకరానికి 20 లక్షల పరిహారం, ఉద్యోగం.. సీఎం సంచలన ప్రకటన..!

మన సాక్షి, మహబూబ్‌నగర్ :

భూనిర్వాసితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. పాలమూరులో శనివారం నిర్వహించిన రైతు పండగ వేదికపై ఆయన మాట్లాడుతూ..

కొడంగల్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కుకు భూములు కోల్పోయిన రైతులకు 10 లక్షలు కాదు ఎకరానికి 20 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దాంతో పాటు చదువుకున్నా.. చదువుకోని వారికి కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనే తన ధ్యేయమన్నారు. పాలమూరు బిడ్డలు ఉపాధి అవకాశాలు పొందకుండా ఉండేందుకే కేసీఆర్ కుటుంబం చిచ్చు పెడుతుందన్నారు.

లగచర్లలో చిచ్చు పెట్టి ఇండస్ట్రీస్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎవరు అడ్డుపడ్డా తొక్కుకుంటూ నిధులు విడుదల చేసి పాలమూరును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు