Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

నల్లగొండ, మన సాక్షి :

వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ సమక్షంలో నిర్వహించారు.

నల్గొండ జిల్లా కలెక్టర్ వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఈ నెల 3 నుండి 10 వరకు స్వీకరించిన నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.

సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, నామినేషన్ల సమయం ముగిసిన తర్వాత మొత్తం (23) మంది అభ్యర్థులు (50) నామినేషన్ సెట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థి తుండు ఉపేందర్ నామినేషన్ పత్రాలపై సంతకం లేని కారణంగా రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ ను తిరస్కరించారు.

దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 22 మంది అభ్యర్థులు నిలిచారు. నల్గొండ అదనపు కలెక్టర్ మరియు వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు ఉన్నారు.

■ లేటెస్ట్

  1. Nalgonda : రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే పై విమర్శలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి..!

  2. Rahul Gandhi : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..!

  3. Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు..!

  4. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

మరిన్ని వార్తలు