TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండ

Pds Rice : 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం.. 11 కేసులు..!

Pds Rice : 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం.. 11 కేసులు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మూడు నెలల కాలంలో మిర్యాలగూడ పోలీసులు 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకుని 11 కేసులు నమోదు చేశారు. పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై మిర్యాలగూడ పోలీసులు ఉక్కు పాదం మోపారు.

మండలంలోని కొత్తగూడెం గ్రామం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 30 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు. వివరాల ప్రకారం మిర్యాలగూడెం వైపు నుండి ఆంధ్ర వైపుకు వెళుతున్న గూడ్స్ వాహనంలో తెల్ల బస్తాలు కలిగి ఉన్నాయి. దానిపైన టార్పాలిన్ కప్పబడి ఉన్నందున అనుమానంతో అట్టి వాహనాన్ని ఆపుటకు ప్రయత్నించగా ఆపకుండా పారిపోతుండగా వెంబడించి కొద్ది దూరంలో పట్టుకొని చూడగా అందులో 60 తెల్ల బస్తాలలో 30 క్వింటాల పిడిఎస్ బియ్యం కలిగి ఉన్నాయి.

వాహనం డ్రైవర్ ను అందులో గల మరో వ్యక్తిని విచారించగా పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారంకు చెందిన పిండి పూలు పర్వతాలు అనే యజమాని పిడిఎస్ బియ్యం లోడ్ చేసి పంపిస్తూ ఆంధ్రాలో నరసింహారావు అను వ్యాపారి వద్ద అన్లోడ్ చేయుటకు పంపిస్తే వెళుతున్నామని తెలిపినారు. ఇట్టి అక్రమ బియ్యం లోడును వాహన డ్రైవర్ కార్తీక్, వాహనంలో ఉన్న మరో వ్యక్తి గోపి, వాహన యజమాని పర్వతాలు,

బియ్యం కొనుగోలు చేయు నరసింహారావు అను నలుగురిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా గాని ప్రభుత్వo రేషన్ షాపులకు సరఫరా చేసే పీడియస్ బియ్యంను అక్రమంగా కలిగి ఉన్నా, వ్యాపారం చేసినా.. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గత మూడు నెలల కాలంలో 11 కేసులు నమోదు చేసి 330 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీన పరుచుకోవడం జరిగిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు