Narayanpet : వాలీబాల్ లో జాతీయస్థాయికి ఎంపికైన 7వ తరగతి విద్యార్థిని.. SP అభినందన..!
Narayanpet : వాలీబాల్ లో జాతీయస్థాయికి ఎంపికైన 7వ తరగతి విద్యార్థిని.. SP అభినందన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. వాలీబాల్ లో జాతీయ స్థాయికు కు ఎంపిక అయిన గుండుమల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 7 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కె. లావణ్య వాలీబాల్ కోచ్ ఎండి. సాదిక్ లు బుధవారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ నీ మర్యాదపూర్వకంగా కలిశారు.
మెదక్ లోని చేగుంట లో రాష్ట్రస్థాయి సిఎం కప్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని, జాతీయ స్థాయిలో ఈనెల 7తేది నుండి 16 తేది వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొంటుందని కోచ్ సాధిక్ తెలిపారు. ఎస్పీ విద్యార్థిని, విద్యార్థి తండ్రి నగేష్ ను కోచ్ ఎండి సాధిక్ ను అభినందించి శాలువాతో సన్మానించారు.
విద్యార్థిని జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్పీ ఆకాంక్షించారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని అలాగే రాష్ట్ర స్థాయి జాతీయస్థాయిలో క్రీడలలో పాల్గొనాలని ఎస్పీ తెలిపారు.
MOST READ :









