Mavoist : మావోయిస్టు కార్యకలాపాలు చేపడుతున్న ఇద్దరు అరెస్ట్
మావోయిస్టు కార్యకలాపాలు చేపట్టుతున్న ఇద్దరు అరెస్ట్
జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్
కొమురం భీమ్ ఆసిఫాబాద్, మన సాక్షి :
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో మావోయిస్టు కార్యకలాపాలు చెపట్టుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ శనివారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు.
అరెస్ట్ అయిన వారి వివరాలు :
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కోట ఆనందరావు, నల్గొండ జిల్లా మునుగోడు మండలము చేన్నగొని గణేష్ అలియాస్ అభిరాం అలియాస్ సూర్య ఉన్నారు .
ఈనెల 28 విశ్వసనీయ సమాచారం మేరకు కాగజ్‌నగర్ రూరల్ సిఐ నాగరాజు, పెంచికల్పేట్ పోలీస్ సిబ్బంది తో కలిసి అగర్ గూడ గ్రామ శివారు గుట్టల వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించుచుండగా కోట ఆనందరావు , చేన్నగొని గణేష్ లు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై బెజ్జూర్ అటవీ ప్రాంతం వెళ్తున్నారు.
వారిని పట్టుకొని విచారించంగా వారు సిపిఐ మావోయిష్టు పార్టీ కి సానుభూతి పరులుగా పనిచేయుచు ప్రజా సంఘాలలో పని చేస్తున్నామని , సిపిఐ మావోయిష్టు పార్టీ దళం లో చేరుటకు సభ్యులను రిక్రూట్ చేస్తున్నామని, వారు వచ్చినప్పుడు వారికి వస్తువులు కొనిపెట్టటం , వాటిని సరఫరా చెయ్యటం, భోజనం పెట్టటం, అదేవిధంగా ఊర్లలో ఉన్న మిలిటెంట్ లను పార్టీకి అనుకూలంగా పని చేసే విధంగా చేస్తున్నామన్నారు.
సిపిఐ మావోయిష్టు పార్టీ తరుపున కాంట్రాక్టర్ ల వద్ద డబ్బులు వసూలు చేసి ఇస్తున్నాం అని, తనకు సిపీఐ మావోయిష్టు పార్టీ లో కొంత మందితో పరిచయాలు ఉన్నవని, అప్పుడప్పుడు వారిని మా ఊరికి వచ్చినప్పుడు గడ్చిరోలి అడవీ ప్రాంతంలో మరియు ఛత్తీస్-ఘడ్ అడవీ ప్రాంతానికి వెళ్ళి కలిసేవాడినని, చెప్పినట్లు తను నడుచుకునే వాడినని చెప్పాడు.
కోట ఆనందరావు వద్ద ఉన్న చేతి సంచి ని తనిఖీ చేయగా అందులో (5) జెలటిన్ స్టిక్స్, (15) ఎలక్ట్రిక్ డిటోనేటేర్స్ మావోయిస్టు సాహిత్యం, మొబైల్ ఫోన్, మోటర్ సైకల్ స్వాదినం చేసుకోడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు, కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, పెంచికల్ పేట్ ఎస్ఐ విజయ్, కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ సోనియా పాల్గొన్నారు.









