Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయం

Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

Modi : తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు.. ప్రారంభమైన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. !

న్యూఢిల్లీ, మన సాక్షి :

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభమైంది. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ పార్లమెంటు భవనం వేదికైందన్నారు.

కాగా యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణకు ఇరు రాష్ట్రాలు కూడా అసంతృప్తికి గురయ్యాయని మోడీ పేర్కొన్నారు. ఈ పార్లమెంటు భవనం చారిత్రికమైందని.. వీడ్కోలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

స్వాతంత్రానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్ గా ఉండేదని, అనేక చారిత్రకమైన చట్టాలకు ఇది వేదిక అయింది అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా వెళ్ళొస్తుందని పేర్కొన్నారు.

ALSO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

మీడియాతో నరేంద్ర మోడీ :

ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న పార్లమెంటు సమావేశాలు సోమవారం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని దేశ ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.

పార్లమెంటు సమయం తక్కువగా ఉండవచ్చు కానీ చారిత్రకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని అన్నారు. తొలి రోజు పార్లమెంటు సమావేశాలు పాత భవనంలోనే ప్రారంభం కాగా మరుసటి రోజు నుంచి నూతన భవనంలో సమావేశాలు నిర్వహించనున్నారు.

ALSO READ : సిరిసిల్ల : డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

అనేక కారణాల వల్ల పార్లమెంట్ చరిత్రలో నిలువబోతుందన్నారు. విశ్వాసం , ఉత్సాహంతో ఈ సెషన్ ఉంటుందని మోడీ పేర్కొన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జి 20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అవడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ ఆశా కిరణంగా మారిందన్నారు.

ఈ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రిక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మోడీ వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు సభ్యులంతా హాజరుకావాలని ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదని సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొనాలని పేర్కొన్నారు . అఖిలపక్ష సమావేశంలో రెండు రోజుల అజెండా మాత్రమే ఇవ్వడంతో మిగతా మూడు రోజుల్లో ఏదైనా సర్ ప్రైజ్ ఉంటుందేమో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.

ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణం పై చర్చ జరుగుతోంది. పార్లమెంటు ప్రయాణంలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు చర్చించగా ప్రధాని మోడీ ప్రసంగించి చర్చను ప్రారంభించారు.

ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

మరిన్ని వార్తలు