Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!
Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!
మిర్యాలగూడ (నల్లగొండ) మన సాక్షి :
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ కార్యక్రమాన్ని నిర్వహించుచున్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీ నుంచి ఈ కేవైసీ కార్యక్రమం ఆయా రేషన్ దుకాణాలలో నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చును. రేషన్ దుకాణాల పని దినములలో ఈ కేవైసీ చేయించుకోవచ్చును. అంతేకాకుండా ఈ నెల 24వ తేదీ తర్వాత కూడా ఈ నెలాఖరు వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు రేషన్ డీలర్లను ఆదేశించారు.
రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం కావడానికి ( ధ్రువీకరణ ) ఈ కేవైసీ చేయించుకోవాలి. మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలి.
ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!
ఈ- కేవైసీ ఎప్పుడు..? ఎలా..? ఎక్కడ..? చేయించుకోవాలి. సందేహాలు – నివృత్తి
1) మా ఇంట్లో 5 మందిమి ఉన్నాము కార్డులో ఉన్న ఎవరమైన ఒకరము వచ్చి వేలి ముద్ర వేస్తే సరిపోతుందా..?
కాదు కార్డులో నమోదైయున్న ప్రతి కుటుంబసభ్యుడు కచ్చితంగా రేషన్ షాపుకు వచ్చి వేలిముద్ర లేదా ఐరిష్ ఇవ్వాల్సి ఉంటుంది.
2) మా కార్డులో పేర్లు ఉన్న అయిదు మందిలో ప్రస్తుతం ఇద్దరమే ఉన్నాము. మిగతా ఇద్దరు బ్రతుకు దెరురువుకొరకు బొంబాయి మరియు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లినారు. మరి వారు వేలి ముద్ర వేయకపోతే బియ్యం ఆగిపోతాయా?
అలాంటిదేమి లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపుకైనా వెళ్లి మీ కార్డు నంబర్ చూయించి అందులోని మీ పేరును తెలిపి వెలిముద్ర ఇచ్చి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అయితె మీ పేరు నమోదైన షాపులో ఈ కేవైసీ చేయించుకోవడం ఉత్తమం . ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, వారు వచ్చినప్పుడు వెలిముద్ర ఇచ్చి ఈ కేవైసీ చేయించుకోవచ్చును.
3) మా ఇంట్లో ఇంకా నలుగురు పిల్లల యొక్క పేర్లు,, కొడుకులు /కూతుర్లు పేర్లు రేషన్ కార్డులో లేవు మరి వారి పరిస్థితి ఏంటి?
ఇట్టి ఈ కేవైసీ (ekyc) అందరివి పూర్తి స్థాయిలో అయిపోయిన తరువాత అట్టి వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కావున రేషన్ కార్డులో పేరు లేని వారిని రేషన్ షాపుకు తీసుకురావాల్సిన అవసరం లేదు.
ALSO READ : నారాయణపేట : నెలాఖరులోగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..!
4) మా కోడలు పేరు వారి పుట్టింటి ఊరిలో ఉంది. ఇక్కడ ఈ కేవైసీ చేయించుకోవచ్చా..?
వారి పుట్టింటి ఊరిలో వీరి పేరు రేషన్ కార్డులో నమోదై ఉంటే అక్కడి కార్డు నంబర్ వ్రాసుకొని వచ్చి ఇక్కడ కూడా ఈ కేవైసీ చేయించుకోవచచ్చు. ఒకవేళ వీరి పేరు కార్డులో తొలగించికొని ఉంటే అక్కడ గాని, ఇక్కడగాని, ఈ కేవైసీ చేయించుకోవడానికి రాదు
5) ఇట్టి ఈ కేవైసీ చేయించుకోవాడానికి రేషన్ షాపులో డబ్బులేమైన చెల్లించవలేనా..?
అలాంటిదేమి లేదు ఇట్టి పనిని పూర్తిగా ఉచితంగా నే చేయబడును.
6) రేషన్ షాపుకు కుటుంబసభ్యులు అందరు ఒకేసారి వచ్చి ఈ కేవైసీ చేయించుకోవాలా..?
అందుబాటులో ఎవరు ఉంటే వారు ఈ కేవైసీ చేసుకోవచ్చు. కాకపోతే షాపుకు వచ్చే ప్రతి ఒక్కరు తమ రేషన్ కార్డు లేదా కార్డు తీసుకరావలసి ఉంటుంది లేదా కార్డు నంబర్ వ్రాసుకు రావాలి.
7) మా ఇంట్లో కొందరివి వేలిముద్రలు కానీ కనుపాప కాని స్కాన్ కావడం లేదు వారి పరిస్థితి ఏమిటి..?
దగ్గర లో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్లి వేలి ముద్ర /కనుపాప ఇచ్చి మీ ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకున్న తరువాత రేషన్ షాపుకు వచ్చి ఈ కేవైసీ చేయించుకోవాలి. అక్కడ కూడా ఆదార్ నంబర్ కు అనుసంధానం కాకపోతే అట్టి వాటిపై ప్రభుత్వం ఏదైనా మార్గదర్శకాలు ఇవ్వవచ్చు . వేచిచూడాలి.
ALSO READ :










