Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిడి పాండురంగారెడ్డి మృతి..!

BREAKING : రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిడి పాండురంగారెడ్డి మృతి..!

చింతపల్లి, మన సాక్షి :

హైదరాబాద్ నాగార్జున సాగర్ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

చింతపల్లి మండలంకురంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమ్మిడి పాండురంగారెడ్డి సోమవారం ఉదయం హైదరాబాదు నుండి టీఎస్ 07HJ1318 నెంబర్ గల బుల్లెట్ వాహనంపై తన స్వగ్రా మ మైన కురంపల్లి గ్రామానికి వెళ్తుండగా మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 07uco 264 నెంబర్ గల డీసీఎం వ్యాను చింతపల్లి మండల పరిధిలోని మదనాపురం గేట్ సమీపంలో హైదరాబాదు నుండి ఎదురుగా వస్తున్న బుల్లెట్ వాహనాన్ని డీసీఎం వ్యాన్ బలంగా ఢీ కొట్టింది.

దీంతో సమ్మిడి పాండురంగారెడ్డి కు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని ఎస్ ఐ యాదయ్య, ఏఎస్ఐ చంద్రారెడ్డిలు మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ALSO READ : Modi : తెలంగాణలో రూ.6697 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన నరేంద్ర మోడీ..!

మరిన్ని వార్తలు