Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Rice Mill : పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కూలిన గోడ.. తప్పిన పెను ప్రమాదం..!

Rice Mill : పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కూలిన గోడ.. తప్పిన పెను ప్రమాదం..!

నేలకొండపల్లి, మన సాక్షి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, మండల కేంద్రం సమీపంలోని ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు లో ప్రమాదవ శాత్తు గోడ కూలింది. ఆ సమయంలో హమాలీలు, రైతులు దూరంగా ఉండటం వలన పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల కేంద్రం కు సమీపంలో ఉన్న సాయి లక్ష్మి ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లు లో ప్రమాదవశాత్తు గోడ కూలింది.

కాగా గోడ కూలిన సమయంలో మిల్లు హమాలీలు. రైతులు ఆ సమయంలో బయట ఉండటం వలన పెను ప్రమాదం తప్పింది. గోడ కూలి మిల్లు యంత్రాల పై పడటంతో ఆ నష్టం జరిగింది. యాసంగి ధాన్యం ను రైతులు హమాలీలు పరుగులు తీశారు. మిల్లులో ప్రమాదం జరగటంతో తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు ను నిలిపివేశారు. దీంతో రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకొచ్చి రహదారి వెంట పడిగాపులు కాస్తున్నారు. కొంత మంది మిల్లు వద్ద నుంచి ధాన్యం ను తీసుకెళ్లి దళారులు కు విక్రయించుకుంటున్నారు.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!

 

మరిన్ని వార్తలు