Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Operation Muskan : ఆపరేషన్ ముస్కాన్ తో 21 మందికి విముక్తి..!

Operation Muskan : ఆపరేషన్ ముస్కాన్ తో 21 మందికి విముక్తి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో శుక్రవారం ఆపరేషన్ ముస్కాన్- 10 బృందం దాడులు నిర్వహించి 05 మంది బాలకార్మికులను పట్టుకోవడం జరిగిందనీ ఆపరేషన్ ముస్కాన్ 10 నోడల్ అధికారి డిఎస్పి ఎన్ లింగయ్య తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకు 21 మంది బాల కార్మికులను పట్టుకోవడం జరిగిందనీ వీరిలో 20 మంది బాలికలు, ఒక బాలుని పట్టుకోవడం జరిగిందన్నారు.

వీరంతా బట్టల షాపులలో, కిరాణం షాప్, మెకానిక్ షాప్ లో, హోటళ్లలో, పత్తి చేలలో బాలకార్మికులుగా పని చేస్తుండగా ఆపరేషన్ ముస్కాన్-10 బృందం దాడులు నిర్వహించి పట్టుకొని సిడబ్ల్యుసి ఆఫీస్ లో అప్పగించడం జరిగిందని తెలిపారు.

18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే అట్టి యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పిల్లలని చదువుకోనివ్వాలని ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మెరుగైన విద్య అందిస్తున్నారని ప్రజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని బడిలో చేర్పించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్100 కాల్ చేసి పోలీసువారికి సమాచారం ఇవ్వగలరని డీఎస్పీ కోరారు.

ఇవి కూడా చదవండి : 

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

స్మశాన వాటికను వదలట్లేదు.. రియల్ వ్యాపారుల చెర నుంచి కాపాడాలని గ్రామస్తుల ధర్నా..!

మరిన్ని వార్తలు