Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం..!
Good News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం..!
పెద్దపల్లి : మన సాక్షి ప్రతినిధి.
గ్రూప్-1 మెయిన్స్ కు ఎంపికైన బి.సి. అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పెద్దపల్లి జిల్లా అభివృద్ధి అధికారి రంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఔత్సాహికులు తమ దరఖాస్తులను వెబ్ సైట్
www.tgbcstudycircle.cgg.gov.in లో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించాలని, 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 5 లక్ష లోపు ఉండాలనీ, ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు 5 వేల రూపాయలు ఉపకార వేతనం అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్ లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నం:8, లక్ష్మీనగర్), అలాగే ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ లలో అందజేయ నున్నట్లు, మరింత సమాచారం కోసం 040-24071188 నంబర్ నందు సంప్రదించాలని రంగారెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.
ALSO READ :
మిర్యాలగూడ : ప్రేమ పేరుతో వేధించి యువతి ఆత్మహత్యకు కారకులైన వారు అరెస్ట్, రిమాండ్..!
Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!









