Miryalaguda : మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
Miryalaguda : మున్సిపల్ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ చేపట్టిన నేను నా మిర్యాలగూడ కార్యక్రమం శనివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. కార్మికులతో కలిసి పట్టణంలోని పలు వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం సమయంలో పారిశుధ్య కార్మికులతో కలసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సామూహిక బంతి భోజనం చేయడం జరిగింది.
అనంతరం వారితో కూర్చొని పట్టణ పారిశుధ్య కార్యక్రమం గురించి మరియు వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కూర్చొని సామూహిక భోజనం చేయడంతో పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బండి యాదగిరి రెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
ALSO READ :
TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!
ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!










