Breaking Newsక్రైంప్రపంచం

Shooting at Trump rally : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు.. గాయాలతో ఆసుపత్రికి.. (వీడియో వైరల్)

Shooting at Trump rally : అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పులు.. గాయాలతో ఆసుపత్రికి.. (వీడియో వైరల్)

మన సాక్షి :

అమెరికా ఎన్నికల ముందు మరోసారి కాల్పుల కలకలం రేపుతుంది. అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న డోనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ర్యాలీపై కాల్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఈ కాల్పుల ఘటన పెన్సిల్వేనియాలోని బట్లర్ లో చోటుచేసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ కు గాయాలు కావడం.. వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

సమాచారం మేరకు ట్రంప్ చెవికి గాయమైనట్లు తెలుస్తుంది. ముఖం మీద కూడా రక్తం అంటుంది. ఈ క్రమంలో సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల్లో జరిపిన అనంతరం సాయుధుడు మరణించినట్లు తెలుస్తోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నారని, వైద్యం జరుగుతుందని ట్రంపు ప్రతినిధి పేర్కొన్నారు.

వీడియో

మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ర్యాలీపై కాల్పులు జరిపినట్లు తనకు సమాచారం అందిందని, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేశారు. నేను అతని కోసం, అతని కుటుంబం, అక్కడ ఉన్న ప్రజలందరికీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. హింసకు తావు లేదని, దానిని ఖండించడానికి మనమంతా ఒక జాతిగా ఏకం కావాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: 

BREAKING : మియాపూర్ జనప్రియా అపార్ట్మెంట్ పైనుండి దూకి యువతి ఆత్మహత్య..!

TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!

మరిన్ని వార్తలు