Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండ్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ తెలియజేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదు.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయల సహాయం అందించనున్నారు. త్వరలోనే ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.
తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి గాను ఆర్థిక సాయం అందజేయనున్నారు. రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయనున్నారు. ఇంటి నిర్మాణానికి అందజేసే ఆర్థిక సహాయంను లబ్ధిదారులకు మూడు విడుదలుగా ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో 82.82 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. దాంతో వీరిలో అర్హులను గుర్తించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దరఖాస్తులు చేసుకున్న వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం అధికారులకు ఇబ్బందిగా ఉంది. దాంతో గ్రామసభలలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని టార్గెట్ నిర్ణయించింది. త్వరలో ఆదేశాలు రానున్నాయని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలో హయత్ నగర్ వరకు మెట్రో..!
TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!









