తెలంగాణBreaking NewsTOP STORIESరాజకీయంసంక్షేమం

Cm Revanth Reddy : రేపే బ్యాంకు ఖాతాలో రుణమాఫీ సొమ్ము.. ముహూర్తం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy : రేపే బ్యాంకు ఖాతాలో రుణమాఫీ సొమ్ము.. ముహూర్తం ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్, మన సాక్షి :

రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ సొమ్ము రేపే (ఈనెల 18వ తేదీన) వారి వారి ఖాతాలలో జమ కానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. బుధవారం ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈనెల 18వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణాలు వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకానున్నట్లు తెలిపారు.

ఈనెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న వారికి రుణమాఫీ అందనున్నాయని, ఆగస్టులో రెండు లక్షల రుణాలు ఉన్న వారికి మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదని.. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలుగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా సూచించారు. రైతు రుణాల మాఫీ సందర్భంగా రేపు గ్రామాలలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి : 

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు