Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

BREAKING : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి రవాణా.. పోలీసులకు చిక్కిన మహిళ, మరో ఇద్దరు..!

BREAKING : హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి రవాణా.. పోలీసులకు చిక్కిన మహిళ, మరో ఇద్దరు..!

నల్గొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లాలో అక్రమంగా గంజాయి డ్రగ్స్ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు.అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేసి జిల్లా కేంద్రంలోని డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

అందులో బాగంగా జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో
బాగంగా ఈనెల 16న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పైన కారులో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు శాలిగౌరారం సీఐ కే కొండల్ రెడ్డి, కేతేపల్లి యస్. ఐ శివతేజ వారి సిబ్బంది జిల్లా టాస్క్ ఫోర్స్ సి‌ఐ రమేశ్ బాబు, ఎస్‌ఐ లు మహేందర్, మహేశ్ వారి సిబ్బంది యుక్తంగా కొర్లపహాడ్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేయడం జరిగిందన్నారు.

ఉదయం అందాజ 10.00 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్ళు రోడ్డులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నికి చెందిన ఒక కారు అనుమానాస్పద స్థితిలో వస్తుండగా పట్టుబడి చేసి వాహనాన్ని తనికి చేయగా ఇద్దరు మగ వ్యక్తులు ఒక ఆడ మనిషిని పట్టుకోవడం జరిగిందన్నారు.

పట్టుబడిన కారులో 74 కేజీల గంజాయి, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ బుద్ నగరానికి చెందిన కారు డ్రైవర్ అశోక్ కుమార్, గంగ మందిర్ దగ్గర, హర్తల, సొనకపూర్, పిలి కోతి, మొరదాబాద్ కు చెందిన దీప్ కుమార్, లక్ష్మీ నగర్, మండవళి నంబర్ -3, ఢిల్లీ కి చెందిన సుష్మా రాయ్ లు, కుసువలి మొరదాబాద్ కు చెందిన ప్రేమ్ సింగ్ ఉత్తర్వుల ప్రకారం ఉత్తర ప్రదేశ్, మొరదాబాద్ నుండి ప్రేమ్ సింగ్ కు చెందిన కారు లో ఒడిస్సా లోని కలిమెల, మల్కాన్ గిరి వెళ్ళి అక్కడ సుశాంత్ వద్ద నుండి (89) ప్యాకెట్లు లలో గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.

గంజాయిని రవాణ చేసినందుకు ఒకొక్కరికి 20,000/- రూ,,లు చొప్పున ప్రేమ్ సింగ్ ఇచ్చేవాడని ఇట్టి గంజాయి విలువ సుమారు రూ. 18,45,625 విలువ ఉంటుందన్నారు.ఇట్టి గంజాయిని పట్టుబడి చేసి, నెరస్థులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇవి కూడా చదవండి : 

Laxettipet : సూసైడ్ నోట్ లో క్లియర్ గా రాసిన వ్యాపారి.. ఉరి వేసుకుని ఆత్మహత్య..! 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం.. పాతాళగంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకుని ఉన్న నాగుపాము.. (వీడియో)

మరిన్ని వార్తలు