Breaking Newsతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

Runamafi : నేడు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము.. ఊరూరా సంబరాలకు ఏర్పాట్లు..!

Runamafi : నేడు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము.. ఊరూరా సంబరాలకు ఏర్పాట్లు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీకి సిద్ధమైంది. నేడు (గురువారం) రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము వేయనున్నారు. రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు మూడు విడుదలగా మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మొదటి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులకు (ఈనెల 18) నేడు రైతు ఖాతాలోకి డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతులకు మొదటి విడత రుణమాఫీ కానున్నది. అందుకుగాను ఏడువేల కోట్ల రూపాయలను ఇప్పటికే బ్యాంకుల కు జమ చేశారు. బ్యాంక్ అధికారులు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు వారి వారి ఖాతాలలోకి జమ చేయనున్నారు.

ఊరూరా.. సంబరాలు : 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేయడంతో గ్రామ గ్రామాన సంబరాలు జరుపుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఈ సంబరాల్లో పాల్గొంటారు. రైతు వేదికల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులకు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి : 

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మీరు దరఖాస్తు చేసుకోండి..!

తెరుచుకున్న ఆల్మట్టి గేట్లు, భారీగా కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఆయకట్టు రైతుల ఆశలు పదిలం..!

మరిన్ని వార్తలు