Runamafi : మీకు రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
Runamafi : మీకు రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
తెలంగాణలో రైతాంగానికి బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఎన్నడూ ఏ పార్టీ , ఏ ప్రభుత్వం లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి చేస్తున్నారు.
అందులో భాగంగా ఈనెల 18వ తేదీన లక్ష రూపాయల వరకు రుణాలున్న రైతులందరికీ మాఫీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతులకు 6098 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో మాట్లాడారు. ఈనెలాఖరులోగా లక్షన్నర వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేయనున్నారు. అదేవిధంగా ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయనున్నారు.
మీకు రుణమాఫీ రాలేదా..?
మీకు వ్యవసాయ భూమి ఉండి.. బ్యాంకులలో రుణం తీసుకున్నారా..? ఒకవేళ తీసుకుంటే.. ఆ అప్పు పంట రుణంగా తీసుకున్నారా.. మీరు పంట రుణం లక్ష రూపాయల లోపు మాత్రమే తీసుకున్నా కూడా.. మీకు ప్రభుత్వం అందించిన రుణమాఫీ పథకం వర్తించలేదా..? మీరు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలకు లోబడి ఉన్నారా..? ఒకవేళ ఉన్నట్లయితే మీ బ్యాంకు ఖాతాలలో డబ్బులు రాలేదా..? అయితే ఇలా చేయండి.
బ్యాంకు ఖాతాలలో మీకు రుణమాఫీ సొమ్ము జమ కానట్లయితే ముందుగా బ్యాంకుకు వెళ్లి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందేమో తెలుసుకోండి. ఆ తర్వాత అధికారిక ఐటి పోర్టల్ ద్వారా మీ సమస్య అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు. అంతేకాకుండా మండల స్థాయిలో ఫిర్యాదులకు పరిష్కార విభాగాన్ని వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేశారు.
మండల స్థాయిలో విభాగానికి వెళ్లి మీరు మీ పేరు, మీ బ్యాంకు ఖాతా ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చును. ఈ సహాయ కేంద్రాన్ని రైతులు ఫిర్యాదు చేసేందుకే ఏర్పాటు చేశారు. రుణమాఫీ అందలేదని రైతులనుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ 30 రోజుల లోపు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిబంధనల మేరకు మీరు అన్ని విధాలుగా అర్హులైనట్లయితే మీకు రుణమాఫీ అందిస్తుంది.
ఇవి కూడా చదవండి :
రూ.లక్షలోపు 40 లక్షల మంది రైతులు.. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు..?
తెలంగాణలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు, హాట్ టాపిక్ గా రాజకీయ సన్యాసం, రాజీనామా..!










