Viral : అప్పుడే పుట్టిన పసికందుకు 32 దంతాలు.. (వీడియో వైరల్)
Viral : అప్పుడే పుట్టిన పసికందుకు 32 దంతాలు.. (వీడియో వైరల్)
మన సాక్షి :
పుట్టిన పిల్లలకు దంతాలు లేకుండా పుడతారని అందరికి తెలుసు. పెరిగే కొద్దీ ఒక్కొక్కటి వస్తుంటాయి సర్వసాధారణం. కానీ అప్పుడే పుట్టిన పాప 32 దంతాలతో జన్మించింది. అది చూసిన తల్లితోపాటు కుటుంబ సభ్యులు ఒకేసారి ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాంతో భయ పడాల్సిన అవసరం లేదని, ఇదొక అరుదైన పరిస్థితి వస్తుందని వైద్యులు భరోసా ఇచ్చారు. దానివల్ల బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు ఆమెకు తెలియజేశారు.
వివరాల ప్రకారం.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో నివసిస్తున్న నిక దివా అనే మహిళ ఇటీవల ఓ నవజాత శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారికి పుట్టుకతోనే 32 దంతాలతో జన్మించింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి హాని జరగదని, ఇలాంటి అరుదైన సంఘటన జరుగుతుందని వైద్యులు భరోసా ఇచ్చారు.
తన కుమార్తె పుట్టిన క్షణం నుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియా పంచుకుంది. ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే తాను ఈ వీడియో పోస్ట్ చేసినట్లు తెలిపింది. ఇతరులకు ఇలాగే పిల్లలు పుడితే కంగారు పడాల్సిన అవసరం లేదని వీడియోలో పేర్కొన్నది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా దంతాల కారణంగా చిన్నారికి తల్లి పాలు ఇచ్చే సమయంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు దంతాలను తొలగించారు.
ఇవి కూడా చదవండి
Runamafi : మీకు రుణమాఫీ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
https://www.instagram.com/reel/C3N6PCeulxS/?igsh=MWFpMWdtZzF6c2ViZQ==









