Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!
మన సాక్షి:
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. గోదావరి నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరగడంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. కాటన్ బ్యారేజీ వద్ద 10. 90 అడుగులకు చేరింది. దాంతో ధవళేశ్వరం ప్రాజెక్టు 175 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. 36.10 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఆరు లక్షల ఇరవై రెండు వేల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ అవుతుంది. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు 52 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 31. 700 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. దాంతో దిగువకు 7.96 లక్షల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.









