Runamafi : రుణమాఫీ పై కీలక అప్డేట్.. రెండవ విడత మాఫి ఎప్పుడంటే..!
Runamafi : రుణమాఫీ పై కీలక అప్డేట్.. రెండవ విడత మాఫి ఎప్పుడంటే..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ కార్యక్రమం మొదటి విడత పూర్తయింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తున్నారు. మొదటి విడత రుణమాఫీ సొమ్ము ఈనెల 18వ తేదీన రైతులకు వారి వారి ఖాతాలలో జమ అయ్యాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.
మొదటి విడత రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 6,098 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీని 3 విడతల్లో చేయనున్నారు. మొదటి విడతగా ఒక లక్ష రూపాయల రుణమాఫీ పూర్తయింది.
రెండవ విడత రుణమాఫీ ప్రక్రియకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండవ విడత రుణమాఫీ ప్రక్రియ లో భాగంగా 1,50,000 రూపాయల వరకు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేయనున్నారు. అందుకుగాను మరో 7 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 31వ తేదీన చేపట్టనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మూడవ విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా 2 లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులవి మాఫీ చేయనున్నారు. ఆగస్టు 14వ తేదీన మూడవ విడత ప్రక్రియ పూర్తికానున్నది. మొత్తం ఆగస్టు 15వ తేదీ లోపు రైతులను రుణ విముక్తులను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం. అందుకు అధికార యంత్రాంగం కార్యచరణ రూపొందించింది. మొదటి విడత రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావడంతో రెండవ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి :
Godavari : గోదావరికి వరద ఉధృతి.. ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తి నీటి విడుదల..!










