Banks : బ్యాంకుల వద్దకు రైతుల ఉరుకుల పరుగులు.. రెండు గ్రామాలకోరోజు, రోజుకు 50 మందికి రెన్యువల్..!
Banks : బ్యాంకుల వద్దకు రైతుల ఉరుకుల పరుగులు.. రెండు గ్రామాలకోరోజు, రోజుకు 50 మందికి రెన్యువల్..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంక్ వద్ద సోమవారం రుణమాఫీ డబ్బుల కోసం రైతులు పరుగులు పెట్టారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మహేందర్ మాట్లాడుతూ.. ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రోజుకు 50 మందికి మాత్రమే రెన్యువల్ చేయబడుతుందని వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి రుణమాఫీ డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
తడ్కల్ ఏపీజీవీబీ రెన్యువల్ వారాలు :
1, రసోల్ , ముర్కుంజాల్, ….సోమవారం
2, చప్టా కె, చప్టా బి,తాండలు… మంగళవారం
3, దామరగిద్ద, బాన్సువాడ…. బుధవారం
4 జంమ్గి కె, జంమ్గి బి,తాండలు .. గురువారం
5 ఘనపూర్, గాంధీనగర్ తాండలు… శుక్రవారం
6, తడ్కల్, తాండలు… శనివారం
రైతులు తీసుకురావాల్సిన పత్రాలు :
ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆర్ఓఆర్ ధరణి పాహని జిరాక్స్,పాస్ ఫోటో రెండు, రెవెన్యూ స్టాంప్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్. తీసుకొని మీ గ్రామం రోజు బ్యాంక్ కు రావాలని రైతులకు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.









