TOP STORIESBreaking Newsతెలంగాణ

ఐక్యరాజ్యసమితి శాంతి సేనకు ఎంపికైన తెలంగాణకు చెందిన జవాన్..!

ఐక్యరాజ్యసమితి శాంతి సేనకు ఎంపికైన తెలంగాణకు చెందిన జవాన్..!

గజ్వేల్, మనసాక్షి :

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే శాంతి సేన కోసం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపీకయ్యారు. మధ్యతరగతి రైతు కుటుంబం అయినా బొక్కి ముత్యాలు లక్ష్మి దంపతుల చిన్న కుమారుడైన వెంకటేష్ చిన్నప్పటి నుండే ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనే బలమైన కోరిక ఉండేది.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వెంటనే ఆజాద్ డిఫెన్స్ అకాడమీ గజ్వేల్ లో చేరి 18 సంవత్సరాలలోనే ఆర్మీలో ఎంపికయ్యారు. 2018 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వెంకటేష్ 2029లో మద్రాస్ రెజిమెంట్ లో కార్యనియుక్తుడై ఉన్నాడు. ఈ మధ్యనే ఆర్మీలో అన్నిటికన్నా కష్టమైన రాష్ట్రీయ రైఫల్లో ఆంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో పాల్గొని వచ్చిన వెంకటేష్, ఆరు నెలలు తిరగకుండానే ఐక్యరాజ్యసమితి పరిధిలో పనిచేసే శాంతి సేనలో ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా బొక్కి వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ నాన్నల ఆశీర్వాదంతో(యూ ఎన్ )మిషన్ లో భాగంగా లేబనాన్ దేశానికి వెళ్లి అక్కడ భారతదేశం యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పని చేసి మన భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తానని తెలియజేశారు.

జవాన్ బొక్కి వెంకటేష్ ఎంపీక కావడం చాలా అభినందనీయమని సిద్దిపేట జిల్లా ఎక్స్ ఆర్మీ సెల్ కన్వీనర్, రిటైర్డ్ ఆర్మీ నీల చంద్రం, ఆజాద్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మమ్మద్ షఫీ ఘనంగా సన్మానం చేశారు.

ఇవి కూడా చదవండి ; 

Good News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి పంట రుణాలు..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా చేసుకోండి..!

రుణమాఫీ ప్రక్రియను బ్యాంకులలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు