నల్గొండలో బ్రాండెడ్ వస్తువుల పేరుతో మోసం.. కాపీ రైట్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..!
నల్గొండలో బ్రాండెడ్ వస్తువుల పేరుతో మోసం.. కాపీ రైట్స్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..!
నల్లగొండ, మన సాక్షి:
వ్యాపారులు బ్రాండెడ్ వస్తువుల పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. వివిధ రకాల వస్తువులను బ్రాండెడ్ పేరుతో విక్రయిస్తున్న వారిపై కాపీరైట్స్ అధికారులు నల్గొండ లోని పలు దుకాణాలలో దాడులు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది.
నల్లగొండలోని పలు దుకాణాల్లో నిర్వహకులు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతలేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ బృందంతో కలిసి కొరడా జులిపించారు.
నల్లగొండ లో గల పలు ఎలక్ట్రికల్ షాప్ లో ఐపి ఇన్వెస్టిగేషన్ ముంబై అధికారులు, వన్ టౌన్ న్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్లగొండ పోలీస్ బృందంతో కలిసి సోదాలు నిర్వహించారు. స్థానిక ప్రకాశం బజార్ లోగల హనుమాన్ ఎలక్ట్రికల్ షాపు నిర్వాహకులు కొన్ని నెలలుగా గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్టు నమ్మదగిన సమాచారం బట్టి సోదాలు నిర్వహించారు.
దాదాపు 22 లక్షల నకిలీ నాణ్యతలేని 16 వైర్ల బ్యాగులను స్వాధీన పరుచుకున్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా పద్మావతి కిరాణా జనరల్ స్టోర్ లో స్లీప్ వెల్ కంపెనీ పేరుతో నకిలీ కల్తీ అగర్బత్తులు దాదాపు ఒక లక్ష 21 వేల విలువ గల ఏడు బాక్సులను స్వాధీన పరుచుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గత వారంలో కూడా హైదరాబాద్ పట్టణంలోని త్రు బజార్లో ఎలక్ట్రిక్ షాపులపై కూడా సోదాలు నిర్వహించి దాదాపు 80 లక్షల నాణ్యతలేని ఎలక్ట్రిక్ వైర్లను స్వాధీనపరుచుకున్నారు. వన్ టౌన్ సిఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యత లేనీ వస్తువులు ప్రజలకు హాని కలిగించే వస్తువులను అమ్ముతున్న మదన్, శ్రీనివాస్ నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐపీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇజ్రార్, పట్టణ వన్ టౌన్ ఎస్సై లు, సందీప్ రెడ్డి, శంకర్, కాపీరైట్ అధికారులు ఇక్బాల్ ఖాద్రి, దినేష్ శెట్టి, సంతోష్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
NALGONDA : మున్సిపాలిటీలలో 26 నుంచి ఇంటింటి సర్వే.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మార్నింగ్ వాక్..!
Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!









