BIG BREAKING : అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా..!
BIG BREAKING : అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు గురువారం హాజరయ్యేందుకు బయలుదేరారు. స్థానిక నందినగర్ లోని ఆయన నివాసం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. ప్రతిపక్ష హోదాలో ఆయన తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొనాలని నిర్ణయించారా..? లేక అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా హాజరుకావాలని నిర్ణయించారా..? అనే విషయం తెలియాల్సి ఉంది.
10 సంవత్సరాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసిఆర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. దాంతో ఆయనకు ప్రతిపక్ష హోదా లభించింది. కానీ కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో కాలు తుంటి వెముక విరగడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. కాగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలో సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించారు. దాంతో ఆయన బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి :
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. శానిటేషన్ పై అసంతృప్తి..!









