క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Theft : 90కి పైగా దొంగతనాలు.. చోరీ డబ్బుతో షార్ట్ ఫిలిమ్స్..! 

Theft : 90కి పైగా దొంగతనాలు.. చోరీ డబ్బుతో షార్ట్ ఫిలిమ్స్..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలోని మక్తల్, మరికల్, నారాయణపేట లో దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీపత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితునీ వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా చేపనపేట గ్రామానికి చెందిన పోలాకి అప్పలనాయుడు వయస్సు 43 సంవత్సరాలు గల వ్యక్తి నారాయణపేట జిల్లాలో తాజాగా జరిగిన ఆరు దొంగతనాలకు సంబంధించిన నిందితుడిగా ఉన్న అప్పలనాయుడు ఇంట్లో అందరూ ఉండగానే చోరీ చేసేవాడని ఎస్పీ వెల్లడించారు.

నారాయణపేట, మక్తల్, మరికల్ పరిధిలో తాజాగా ఆరు చోరీలు చేసినట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో కూడా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. తమ విచారణలో ఇప్పటివరకు సుమారు 90 కి పైగా దొంగతనాలు చేసినాడని, తాజాగా చోరీ చేసిన 6 కేసులకు సంబంధించిన 75 తులాల బంగారం, 35 తులాల వెండి, నాలుగు లక్షల నగదును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

రాత్రి సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒంటిగంట నుండి నాలుగు గంటల మధ్యలో దొంగతనాలు చేసి దొరికిన సొమ్ముతో కర్ణాటక రాష్ట్రం రాయచూరులో జల్సాలు చేస్తూ, పేకాట ఆడుతూ, షార్ట్ ఫిలిం తీస్తూ, డబ్బులు అయిపోయాక మళ్ళీ దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. నిందితుడు దొంగతనాలు చేసేందుకు ఇంట్లోని చిన్న చిన్న వస్తువులను ఉపయోగించేవాడని తెలిపారు.

గురువారం ఉదయం మక్తల్ శివారులో వాహనాల తనిఖీల్లో నిందితుని పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. డి.ఎస్.పి. ఎన్ లింగయ్య పర్యవేక్షణలో దొంగతనాల కేసుని చేదించి నేరస్తుని పట్టుకోవడంలో బాగా పనిచేసిన మక్తల్, మరికల్ సిఐలు చంద్రశేఖర్, రాజేందర్ రెడ్డి, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, మురళి, కానిస్టేబుల్స్ రవీంద్రనాథ్, తిరుపతి రెడ్డి నరేష్ యాదవ్, అశోక్ కుమార్, శ్రీకాంత్, ఐటికోర్ శ్రీనివాసులు లను ఎస్పీ అభినందించి రివార్డు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బిసిఐ రామ్ లాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు