Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!
Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల వల్ల నది ఉప్పొంగుతుంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి… భారీగా వరద చేరుతుంది.
అదేవిధంగా తుంగభద్ర నది నుంచి కూడా శ్రీశైలం కు… వరద ప్రవాహం భారీగా చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం కు గాను ప్రస్తుతం 864.60 అడుగులకు చేరింది. శ్రీశైల జలాశయం వేగవంతంగా పెరుగుతుంది. జలాశయం నుంచి దిగువకు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 56వేల క్యూసెక్కుల నీటిని దిగవ విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలోకి 3.54 లక్షల క్యూసెక్కుల నీరు :
శ్రీశైలం జలాశంలోకి మూడు లక్షల 54 వేల క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం చేరుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఒక లక్ష మూడువేల క్యూసెక్కుల నీరు మొత్తం శ్రీశైలం జలాశానికి మూడు లక్షల 54 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. అధికారులు తెలియజేసిన ప్రకారం.. రోజుకు రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం కు చేరుతుంది. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118 టీఎంసీల నీరు ఉంది.
తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు :
వరద ప్రవాహం భారీగా పెరగడంతో గంట గంటకు శ్రీశైలం జలాశయం నీటిమట్టం పెరుగుతుంది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదేవిధంగా వరద ప్రవాహం కొనసాగితే రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు తెచ్చుకొనున్నాయి. ఇక నాగార్జునసాగర్ జలాశయంలో 590 అడుగుల నీటి సామర్థ్యంకు గాను ప్రస్తుతం 506.3 అడుగుల మేర నీరు ఉంది. 41 వేల క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయంలోకి చేరుతుంది.
ఇవి కూడా చదవండి :
Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!










