Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి ప్రస్తుతం రెండు లక్షల 82 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో జలాశ నీటిమట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 533 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి విలువ సామర్థ్యం 172.87 టీఎంసీలుగా నమోదయింది.
శ్రీశైలంకు కొనసాగుతున్న వరద :
శ్రీశైలం ప్రాజెక్టుకు వారి వరద కొనసాగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండలా ఉండడంతో శ్రీశైలం కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం వద్ద 10 గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్ జలాశయం వేగవంతంగా పెరుగుతుంది.
రేపు ఎడమ కాలువకు నీటి విడుదల :
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆగస్టు 2వ తేదీన నీటి విడుదల చేయనున్నారు. ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని ఖరీఫ్ సాగుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రేపు సాయంత్రం నీటిని విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలం వద్ద అధికారుల హై అలర్ట్.. భారీగా పెరిగిన వరద ఉధృతి.. Latest Update
NALGONDA : అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాల వల్ల స్వయం ఉపాధి.. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి..!
Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!
Miryalaguda : హాస్టల్లో నాణ్యతలేని అల్పాహారం.. సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం..!









