మిర్యాలగూడ : వన మహోత్సవంలో వ్యాపార, వాణిజ్య సంఘాలు భాగస్వాములు కావాలి..!
మిర్యాలగూడ : వన మహోత్సవంలో వ్యాపార, వాణిజ్య సంఘాలు భాగస్వాములు కావాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మన మహోత్సవ కార్యక్రమంలో వ్యాపార వాణిజ్య, సంఘాలు విద్యావంతులు భాగస్వామ్యం కావాలని గెలవడం ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా వైష్ణవి ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్ణాటక రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకటరమణ చౌదరి (బాబి) కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ALSO READ :
Miryalaguda : ప్లాస్టిక్ రహిత మిర్యాలగూడగా మార్చాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Fack currency : జోరుగా నకిలీ నోట్లు చలామణి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా..!










