తెలంగాణలో ఉప ఎన్నికలు.. వైరల్ అవుతున్న న్యూస్..!
తెలంగాణలో ఉప ఎన్నికలు.. వైరల్ అవుతున్న న్యూస్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా..? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దుకానున్నాయా..? అయితే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి.. అనే అంశం వైరల్ గా మారింది. సోమవారం ఢిల్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఢిల్లీలో పలువురు న్యాయ నిపుణులను కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం కలిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని పేర్కొన్నారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు.
ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామన్నారు. నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ALSO READ :
మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..
Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update
BREAKING : నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం..!
Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!









