Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : నల్లగొండ జిల్లాలో.. సాగర్ వరద కాలువకు భారీ గండి..!

BIG BREAKING : నల్లగొండ జిల్లాలో.. సాగర్ వరద కాలువకు భారీ గండి..!

మన సాక్షి, నల్గొండ :

నాగార్జునసాగర్ వరద కాలువకు నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి భారీ గండి పడింది. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మారేపల్లి వద్ద కాల్వకు గండి పడింది. ఈ నెల 2వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద కాలువకు నీటిని విడుదల చేశారు. కాగా కాలువ మరమ్మతులు లేకపోవడంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకే కాలువకు గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు.

ఈ కాలువ ద్వారా 200 చెరువులకు నీరు చేరనున్నది సుమారు 250 గ్రామాలకు తాగునీటి సౌకర్యం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ వరద కాలువకు 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి. కాలువలో బండరాళ్లు, కంపచెట్లు తొలగించకపోవడం వలన గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు.

కాగా ఏఎమ్మార్పీ జే ఈ గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టే నీటి విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.

ALSO READ : 

తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ డ్యామ్ 16 గేట్ల ఎత్తి నీటి విడుదల.. ఎడమ కాలువకు రెండు పంటలకు నీళ్లు..! 

తెరుచుకున్న పులిచింతల ప్రాజెక్టు గేట్లు..!

మరిన్ని వార్తలు