Nagarjunasagar : రెండేళ్ల తర్వాత నిండిన సాగర్.. 22 గేట్ల ద్వారా నీటి విడుదల, కొనసాగుతున్న వరద.. Latest Update
Nagarjunasagar : రెండేళ్ల తర్వాత నిండిన సాగర్.. 22 గేట్ల ద్వారా నీటి విడుదల, కొనసాగుతున్న వరద.. Latest Update
మన సాక్షి, నలగొండ బ్యూరో :
నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండేళ్ల తర్వాత జలకళతో ఉంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయం వెలవెలబోయింది. ఈ ఏడాది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. వరద ప్రవాహం కొనసాగుతుంది.
దాంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. సాగర్ ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆరు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా వరద నీరు పెరగడంతో మంగళవారం మధ్యాహ్నం నాటికి 22 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగర్జులాషానికి 3.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది
శ్రీశైలంకు తగ్గని వరద :
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం భారీగానే చేరుతుంది. 3 90 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతుండగా దాంతో 10 గేట్ల ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల నీటిమట్టం కాను ప్రస్తుతం 806 అడుగుల నీటిమట్టం ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటినిలువ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 298.60 టీఎంసీల నీరు ఉంది. వరద నీటి ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం.
ఇవి కూడా చదవండి :
BIG BREAKING : నల్లగొండ జిల్లాలో.. సాగర్ వరద కాలువకు భారీ గండి..!
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు..!
తల్లిదండ్రుల కష్టానికి ఫలితం.. అన్నా చెల్లెలు కు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు..!
మిర్యాలగూడ : మల్టీ డ్రగ్ వన్ స్టెప్ టెస్ట్ డివైస్ తో గంజాయి సేవించిన వారి గుర్తింపు..!









