తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : స్వచ్చదనం – పచ్చదనం కోసం సమన్వయంతో పనిచేయాలి..!

Miryalaguda : స్వచ్చదనం – పచ్చదనం కోసం సమన్వయంతో పనిచేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చధనం- పచ్చదనం 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు రోజు మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో నిర్వహించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది.

అనంతరం అధికారులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలని అన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలసి మాట్లాడి మధ్యాహ్నం భోజన సదుపాయాలు గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకరరావు, ఎంపీడీవో శేషగిరి శర్మ ,ఎంపీ ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త.. 50 కంపెనీలతో మెగా జాబ్ మేళ.. టెన్త్ పాస్ అయిన వారికి కూడా అవకాశం..!

Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!

మరిన్ని వార్తలు