ఉన్న గదులు కూల్చారు.. కొత్త వాటిని నిర్మించలేదు.. వరండాలో పాఠాలు..!
ఉన్న గదులు కూల్చారు.. కొత్త వాటిని నిర్మించలేదు.. వరండాలో పాఠాలు..!
దేవరకొండ, మనసాక్షి :
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొత్తవి నిర్మించేందుకుగాను ఉన్న తరగతి గదులను కూల్చి వేశారు. తిరిగి కొత్త వాటిని నిర్మించలేదు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన గోరంటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాకాలంలో వర్షం వస్తే ఇక అంతే సంగతి.
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణములోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక ఆరుబయటే పాఠాలు భోదిస్తున్న ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు -మనబడి క్రింద పాత తరగతి గదులను కూల్చేశారు.
ఆరవ తరగతి రెండు సెక్షన్స్ ఏడవ తరగతి రెండు సెక్షన్స్ సుమారు 80 మంది పైగా విద్యార్దులు ఆరుబయట కూర్చొని పాటలు వింటున్నారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చిన ఆరుబయట కూర్చొనే పాఠాలు వినే పరిస్థితి వచ్చింది.
ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు 480 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆరుబయట పాఠాలు భోదించడంతో విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బందులకు గురవుతున్నారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పురప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిద్దాల వలన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. పొరపాట్లను సరిదిద్ది తక్షణమే విద్యార్థులకు సరిపడ తరగతి గదులను మంజూరు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. విద్యాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ALSO READ :
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)
Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే









