Narayanpet : కంచు విగ్రహం పేరుతో మోసం..!
Narayanpet : కంచు విగ్రహం పేరుతో మోసం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం మూడు దొంగతనలకు సంబంధించి డిఎస్పి ఎన్ లింగయ్య పత్రిక సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రం శాసనపల్లి రోడ్డు లోని భారత్ గ్యాస్ ఏజెన్సీలో ఈనెల 8న రాత్రి సమయలో దొంగతనం జరిగింది.
సింగర్ బేస్ కు చెందిన పాలది సతీష్ కుమార్ తన యొక్క భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడం లో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలకొట్టి 25 గ్యాస్ సిలిండర్ లను దొంగాలించినారు అని ఇట్టి విషయం ఫై నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినారు. ఇట్టి కేసు ను పట్టణ పోలీసులు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 24 గంటలలో దొంగతనం కేసును చెందిచినారు.
కేసు వివరలోకి వెళ్ళగా జిల్లా కేంద్రం లోని గాంది నగర్ కుచెందిన నిందితుడు నగిరి ఆనంద్ కొంత కాలంగా ఆట్టి భారత్ గ్యాస్ ఏజెన్సీ లో డెలివరీ బాయ్ గా పని చేస్తుండేవాడని, నిందితుడు ఇటివల మానివేసినాడన్నారు.
నిందితుడు త్రాగుడుకి బానిసై మరియు అప్పులు ఎక్కువై ఎలాగైనా డబ్బులు సంపాదించలనే ఉద్దేశ్యం తో అందుకు గాను గ్యాస్ సిలిండర్లను దొంగాలించాలనే ఉద్దేశ్యంతో ఇంతకు ముందు తనకు పరిచయం వున్న, తన ఆటోలో నిటి సరపరా చేసే నర్సిములు అనే వ్యక్తి సహాయంతో ముందస్తు పథకం ప్రకారము రాత్రి సమయంలో నర్సిములు తో కలిసి శాసన పల్లి రోడ్ లో గల భారత్ గ్యాస్ గ్యాస్ గోదం వద్దకు వెళ్లి దాని లోపల తాళం పగలగొట్టి ఇద్దరు కలిసి నరసింహ ఆటోలో 25 సిలిండర్ లను తిసుకోచి ఇంట్లో దాచి పెట్టినారు.
శనివారం ఆట్టి గ్యాస్ సిలిండర్లను అమ్మడనికై వెల్తుంటే నారాయణపేట పట్టణ పోలీస్ వారు ఆట్టి ఇద్దరు వ్యక్తులను పట్టుకొని ఆటో ను మరియు దొంగలించిన 25 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ అందాజ రూపాయలు 87,500/-ఉంటుందని డిఎస్పి తెలిపారు.
కంచు విగ్రహం తో మోసం చేసిన నిందితుడు.
నెల రోజుల క్రితం పళ్ళ కు చెందిన అనిమొల్ల శివరాజ్ యొక్క తండ్రి కొంత కాలం క్రితం మరణించినాడు. అతని తల్లి యొక్క ఆరోగ్యం కూడా గత కొంత కాలంగా బాగోలేదు. దాంతో తెలిసిన్న వాళ్ళు ఇంట్లో బాగు చేయించుకోవాలి అని చెప్పగా, తెలిసిన్న వారి ద్వారాగా బారంకుంటకు చెందిన గజ్జేలి నరేష్ @ రిశాంత్ ను సంప్రదిచంగా అతను మీ ఇంట్లో పూజలు చేస్తా మరియు మీ ఇంట్లో ఉన్న చెడును బయటకు తీస్తా అని చెపి వారి ఇంట్లో ఒక ములకు గుంత తవ్వించి అందులో పసుపు, కుంకుమ్మ, కోబరికాయ లు వేసి పూజలు చేస్తునట్లు నటించి, వారికి తెలియకుండా ఆ గుంత లో ఒక కంచు శివుని విగ్రహం పెట్టి, అది అప్పుడే అందులో త్రవ్వుతూ ఉంటె దొరికినట్లు నమ్మించి దాని ద్వారాగా ఇంట్లో ఉన్న అరిష్టం పోయీ మీ బాధలు అన్ని ఇప్పటినుంది తొలగిపోతాయని నమ్మ బలికినాడు.
శివుని విగ్రహం తో పాటు మరొక వస్తువును తీసుకెళ్ళి సరఫ్ బజార్ లో తనతో పాటు తీసుకెళ్ళినా వేరే వస్తువును కరిగించి దాని ద్వారా వచ్చిన ఇత్తడి బిస్కేటు ను పిర్యాదు కు ఇచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పి పిర్యాది వద్దనుండి బలవంతంగా నలబై వేల రూపాయలు (40,000)తీసుకొన్నాడు.
దాని తరవాత పిర్యాది ఇట్టి విషయములో మోసపోయనని గ్రహించి ఈనెల 9న నారాయణపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా ఈ రోజు నిందితున్ని సత్యనారాయణ చౌరస్తా లో పట్టుకొని అతని వద్ద నుండి అతను మోసం చేయుటకు ఉపయోగించిన కంచు శివుని విగ్రహాన్ని స్వాదినం చేసుకున్నమన్నారు.
బంగారం దొంగతనం :
ఈనెల 7న భైరంకొండ గ్రామం చాపాలి విజయలక్ష్మి ఇంట్లో గుర్తుతేలియని వ్యక్తులు దొంగతనం జరిగింది అని ఇట్టి విషయం ఫై నారాయణపేట పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినారు , ఇట్టి కేసు ను నారాయణపేట పట్టణ పోలీసులు 48 గంటలలో చెందిచినారు.
నిందితుడు జాజాపూర్ గ్రామం కు చెందిన మన్నే వెంకటేష్ త్రాగుడుకి బానిసై ఎలాగైనా డబ్బులు సంపాదించలనే ఉద్దేశ్యంతో, అందుకు గాను దొంగతనం చెయ్యాలనే ఉదేశ్యంతో భైరంకొండ గ్రామ చివరి లో గల ఫిర్యాదు దారుడు తెరిచి ఉంచిన ఇంట్లో అలమారులో ఉన్న బంగారు చైన్ మరియు పుస్తెల తాడు ను దొంగలించి, చైన్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి అమ్మి, మిగతా దొంగలించిన పుస్తెల తాడును శనివారం అమ్మడనికై నారాయణపేట కు రాగా పోలీసులు నిందుతుని పట్టుకొని పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి మొత్తం విలువ అందాజ 70,000/-ఉంటుందని డిఎస్పి తెలిపారు.
పై మూడు కేసులలో నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పి ఎన్ లింగయ్య తెలిపారు. అట్టి కేసులను చేదించిన పోలీసులను ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్స్ రాము, ఆంజనేయులు, లింగమూర్తి, యాదయ్య, మల్లేష్, రాజు లను డి.ఎస్.పి అభినందించి రివార్డ్ ఇవ్వడం జరిగింది.
ALSO READ :
Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!
Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!
TGSRTC : నాగార్జునసాగర్ టూర్ వెళ్తున్నారా.. ఆర్టీసీ కీలక ఆఫర్..!,











