Breaking Newsతెలంగాణప్రపంచం

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

Cm Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి.. త్వరలో రానున్న బృందం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ సంస్థ ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో ఎల్ ఎస్ గ్రూప్ ఉన్నత స్థాయి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ ఎస్ గ్రూప్ చైర్మన్ ను కలిశారు.

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన శుభారంభంగా ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ (LS Group) చైర్మన్ కు-జాఉన్ (Koo Ja-eun)తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ (LG Group) వ్యవస్థాపకులైన LS Group కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనుంది.

ఎల్ఎస్ గ్రూప్ (LS Group) అధినేతతో ముఖ్యమంత్రి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు, ఎల్ఎస్ గ్రూప్ సీనియర్ ప్రతినిధులు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!

మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!

Cm Revanth Reddy : డ్రైవర్ లేని కారులో సీ ఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..!

Viral News : ఏడవ తరగతి కుర్రాడి లీవ్ లెటర్.. చదివితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..!

మరిన్ని వార్తలు