NARAYANPET : హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు.. ఎంపీ డీకే అరుణ..!
NARAYANPET : హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదు.. ఎంపీ డీకే అరుణ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రజల్లో జాతీవాదం పెంపొందించడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తిరంగా ర్యాలీ హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు పార్లమెంట్ ఎంపి డికె.అరుణ అన్నారు. అలాగే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు నాగు రావు నామాజీ, కే. రతంగ్ పాందురెడ్డి,జిల్లా బిజెపి అద్యక్షుడు పి.శ్రీనివాసులు తో కలిసి- బీజేపీ యువమోర్చ, మహిళమోర్చ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీర్యాలీ
చౌక్ బజార్ నుంచి సత్యనారాయణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, చిట్టెం నర్సిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎంపి.మాట్లాడుతు స్వాతంత్ర్య సమరంలో మహనీయుల పోరాటాలను స్మరించుకున్నారు. దేశ ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకే ఈ తిరంగా ర్యాలీ అన్నారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషం, ఇలాంటి దాడులు సరికావని ఖండించారు.
2047 కల్లా ఈ దేశాన్ని విశ్వ గురుగా వికసిత్ భరత్ సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదికి మనమంతా అండగా ఉండాలని కోరారు.బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దారుణం అన్నారు.ముఖ్యంగా అక్కడ హిందువులపై జరుగుతున్న దాడుల్ని ప్రజలంతా పార్టీలు మతాలు,కులాలకు అతీతంగా మనమంతా సమిష్టిగా ఖండించాలన్నారు.
మానవతకు, జాతీయ సమైక్యతను దెబ్బ తీసే ఇలాంటి సంఘ విద్రీహ శక్తుల దాడులకు సహించబోమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యంగా ఉన్న భారత్ లోకి చొరబడేందుకు కొందరు యత్నిస్తున్నారని అలాంటి కుట్రలను సాగనియకుండ మోడీ ప్రభుత్వంసరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తోందన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసిన మనమంతా ఐక్యంగా ఉండాలి జాతీయ సమైక్యతను చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గౌడ్, ఎ.వెంకట్ రాములు, కెంచే శ్రీనివాసులు,జిల్లా నాయకులు భాస్కర్, లక్ష్మి శ్యామ్ సుందర్ గౌడ్,సిద్ది వెంకట్ రాములు,సత్య యాదవ్, జి.రఘువీర్ యాదవ్మం, డల, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
మిర్యాలగూడ : SBI శాఖ తరలింపు.. ఆందోళనలో రైతులు..!
Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!
Good News : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. సేల్స్ ఎంపోరియం ఏర్పాటు..!









