మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!
మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!
మిర్యాలగూడ, మన సాక్షి :
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 100 అడుగుల జాతీయ జెండాను నిర్మించారు. మిర్యాలగూడలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. 100 అడుగుల జాతీయ జెండాను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేశారు.
ఈ జాతీయ జెండాను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ లో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అందుకు వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, ఉద్యోగులు, విద్యావేత్తలు సామాజికవేత్తలు, మేధావులు పాల్గొని విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే వారంతా శాంతికి చిహ్నమైన తెల్ల చొక్కాలు ధరించి హాజరుకావాలని బీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ALSO READ :
Nelakondapally : పాపం.. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆ చిన్నారులకు తెలియదు..!
Govt Land : దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!
Miryalaguda : చింతపల్లి రోడ్ లో చిమ్మ చీకట్లు.. భయాందోళనలో ప్రజలు..!









