TOP STORIESBreaking Newsఉద్యోగంజాతీయం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

నిరుద్యోగ యువకులకు భారత రైల్వే డిపార్ట్మెంట్ శుభవార్త తెలియజేయనున్నది.
రైల్వే రిక్రూట్మెంట్ ఆధారంగా రైల్వే శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ (టి సి) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ వెలువలనున్నది.

11,250 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధం చేశారు. రైల్వే వ్యవస్థ దేశంలోనే అతిపెద్దది. రైల్వే టి సి ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ వారికి వయోపరిమితి కూడా సడలింపులో ఉంటుంది.

నోటిఫికేషన్ లో వయోపరిమితి పూర్తి వివరాలు పేర్కొంటారు. అదేవిధంగా భారతీయులై ఉండి నిర్దేశిత వయసు, అర్హతలు ఉన్నవారు ఈ రైల్వే టి సి ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చును.

ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ Indianrailways.gov.in పరిశీలించాల్సి ఉంటుంది.

రైల్వే టి సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస ఎత్తు ఉండాలి, దృష్టిలోపం కూడా ఉండకూడదు. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఉద్యోగంలో చేరిన వెంటనే 35 వేల రూపాయల వేతనం పొందవచ్చును. త్వరలో నోటిఫికేషన్ వెలువలనున్నది.

ALSO READ : 

Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!

Runamafi : రుణమాఫీపై మరో కీలక ప్రకటన.. వారి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్..!

మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!

BREAKING : నల్లగొండలో రూ.1.41 కోట్ల విలువైన గంజాయి దగ్దం..!

 

మరిన్ని వార్తలు