Job Mela : రేపు మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోండి.. జిల్లా ఎస్పీ..!
Job Mela : రేపు మెగా జాబ్ మేళా, సద్వినియోగం చేసుకోండి.. జిల్లా ఎస్పీ..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణం లోని పంచాక్షరి ఫంక్షన్ హాల్ లో శనివారం (17 ఆగస్టు ) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమంఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు. నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సౌజన్యంతో పోలీసు శాఖ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీలకు పైగా పాల్గొంటాయని, 10వ తరగతి, ఇంటర్, డిప్లమో, ఐటిఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ అండ్ ఫార్మసీ మొదలగు విద్యార్హత కలిగిన యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు.
జాబ్ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు వాల్ పేపర్ లోని స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే బయోడేటా ఫామ్ ఉంటుందని అందులో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
మెగా జాబ్ మేళాకు హాజరయ్యే యువతి, యువకులు బయోడేటా ఫామ్ తో పాటు స్టడి జిరాక్స్ సర్టిఫికెట్స్ తో ఉదయం 09:00 గంటల వరకు కోస్గిలోని పంచాక్షరి ఫంక్షన్ హాల్లో హాజరుకావాలని ఎస్పీ తెలిపారు.
ALSO READ :
Telangana : ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం.. కోదండరామ్ కు కీలక పదవి..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!









