Vemulapally : నాగార్జున సాగర్ ఎడమ కాలువలో బాలిక గల్లంతు..!
Vemulapally : నాగార్జున సాగర్ ఎడమ కాలువలో బాలిక గల్లంతు..!
వేములపల్లి, మన సాక్షి :
పెండ్లి ఇంటిలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా పెళ్ళికి వచ్చిన బంధువులతో కళకళలాడిన కుటుంబం ఒక్కసారిగా దుఃఖం లో మునిగిపోయింది.
బట్టలు ఉతికేందుకు వెళ్లిన బాలిక రాఖీ పండగ పూట ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోవడం తో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…
సూర్యాపేట మండలం కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన పోతురాజు తేజశ్రీ (14) మండలంలోని బుగ్గ బావి గూడెం గ్రామంలో తన మేనమామ కోదాటి పరుశరాములు పెళ్లికి ఈనెల 18న తల్లిదండ్రులతో కలిసి వచ్చింది.
కాగా సోమవారం మధ్యాహ్న సమయంలో తల్లి విజయలక్ష్మితో పాటు మరికొందరు బంధువులతో కలిసి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు. కాలువలోకి దిగిన తేజశ్రీ కాలుజారి ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది.
అక్కడ ఉన్న బంధువులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.
ALSO READ :
Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!
KTR : అధికారంలోకి రాగానే.. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం..!
Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!









